ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలం పరిధిలోని స్థానిక రాంపురం గ్రామ పాకాల ఏటి చెక్ డ్యాం వద్ద బుధవారం వరద నీరు ప్రవాహంతో పొంగి పొర్లి ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావం వల్ల ఐదు రోజుల వరకు భారీ వర్షం సంభవించడంతో ఇటు వైపు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇటు వైపు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.