ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో బుగ్గ వాగు ప్రక్షాళన పనులు జరుగుతున్నట్లు 20వ వార్డు కౌన్సిలర్ మొగిలి లక్ష్మి ఆదివారం తెలిపారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు స్టేషన్ బస్తీలోని సుమారు 60 నివాస గృహాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ప్రక్షాళన పనులు చేపట్టినట్లు చెప్పారు.