వైరా: 26న జరిగే నిరసనను జయప్రదం చేయాలి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు, కార్మికుల వ్యవతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు కోరారు. వైరాలోని బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. రాంబాబు, అర్జున్ రావు గోపాలరావు, చలపతిరావు, శ్రీనివాసరావు ఉన్నారు.