రోడ్డుకు ఇరువైపులా గోడలు నిర్మిస్తున్న తీరు, దాదాపు 15 అడుగుల ఎత్తులో రెండంతస్తుల భవనం ప్రస్తుతం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఆరు అడుగుల వెడల్పున్న ఓ జాగాలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూడా ఇటీవల వైరల్ అయింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న ఈ ఇంటిని స్థానికులు భారతీయ బుర్జ్ ఖలీఫా అని నామకరణం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.