మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగుల్లో ప్రజా పోరాటాలను నిర్మించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఏన్కూరు మండలం జన్నారంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరుల స్తూపాలకు నాయకులు నివాళులర్పించారు. అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.