వైరా క్యాంపు కార్యాలయం నందు మంగళవారం ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అధ్యక్షతన రైతాంగ సదస్సు నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సిరెడ్డి తెలిపారు. వైరా రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కావున ఈ విషయాన్ని ఆయకట్టు రైతులు, రైతు సంఘాల నాయకులు గమనించి సదస్సుకు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు.