వచ్చే నెల 1నుంచి 5 వరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. గురువారం సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత ఎన్నికల అవగాహన సదస్సులో మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు పూర్తి స్థాయిలో నమోదు చేస్తే బూత్ కమిటి, మండల కమిటీ ఎన్నికలకు అర్హత సాధిస్తామని తెలిపారు.