మహారాష్ట్ర ప్రజలు ప్రధాని మోదీ పరిపాలనపై నమ్మకం పెట్టి మోదీతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించి 288 సీట్లకు 220 సీట్లు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టి అఖండ విజయం అందించారని బీజేపీ ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.