కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. ఈ మేరకు ప్రియాంక విజయంతో సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, నాయకులు పాల్గొన్నారు.