మహాశివరాత్రి సందర్భంగా సత్తుపల్లి బస్టాండ్ నుంచి నీలాద్రి శైవక్షేత్రానికి బుధవారం డిపో మేనేజర్ కె. రాజ్యలక్ష్మి ఆధ్వర్యాన ప్రతి పది నిమిషాలకో బస్సు చొప్పున 25 ఆర్టీసీ బస్సు లు తిప్పారు. బస్టాండ్, నీలాద్రిలో ప్రత్యేక బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ విజయశ్రీ, ఎంఎఫ్ సాహితి, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.