శ్రీకనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీకనకదుర్గ అమ్మవారిని శుక్రవారం మంత్రి తుమ్మల దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా
కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ ప్రారంభించారు. వారికి కమిటి సభ్యులు శాలువాతో సత్కరించారు.