చిన్నప్పటి నుండే మొక్కలను నాటడం పిల్లలకు అలవాటు చేయాలని పద్మశ్రీ వనజీవి రామయ్య సూచించారు. ఇటీవల కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ద్వారా నంది పురస్కారం అందుకున్న చిన్నారి విశ్వామిత్ర చౌహన్ ను సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని వారి నివాసంలో ఆయన అభినందించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదం కలిగిన చక్రాన్ని చిన్నారికి బహుకరించారు. మూడేళ్ల వయసు నుండే మొక్కలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించారు.