పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైకిళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పిఎస్ఆర్ ట్రస్టు సభ్యులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.