రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ కుటుంబానికి స్మార్ట్ కార్డు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందులో ఆ కుటుంబానికి సంబంధించి స్థితిగతులు, ఇతర వివరాలన్నీ ఉంటాయని తెలిపారు. తద్వారా వారి అర్హతల మేరకు పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి, మద్దులపల్లి, గుర్రాలపాడులో సీసీ రోడ్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు.