ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య తెలిపారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపలు వదిలి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలోని 896 జలాశయాల్లో ఉచిత చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ నిర్ణయించగా, 35-40 మి. మీలు, 80-100 మి. మీల చేప పిల్లలను విడుదల చేస్తారు.