మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో గల ఆరోగ్య కేంద్రం నందు బుధవారం మండల వైద్యాధికారులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారులు సూచనల మేరకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు సూచించారు.