ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన నిర్వహిస్తున్న మరమ్మత్తుల పనుల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేసి మరమ్మత్తుల పనులు నిర్వహించాలని కోరుతున్నారు.