రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో మధిర పట్టణంలోని పలువురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగం పొంది బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటున్న సందర్భంగా ఆ అభ్యర్థులను మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, పలువురు పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.