మధిర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో మంగళవారం మధిర మండల హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు కోటా వెంకట్ ఆధ్వర్యంలో పేరెంట్స్, టీచర్స్ ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిగత ఎదుగుదలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.