చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కిరాణం దుకాణం యజమాని కటికోల రామకృష్ణ రూ. 40. 77 లక్షలకు శనివారం దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. గ్రామంలో 12 ఏళ్లుగా కిరాణా దుకాణం నిర్వహిస్తూనే పత్తి, మిర్చి క్రయవిక్రయాలు చేపడుతున్న ఆయన 21 మంది వద్ద రుణాలు తీసుకున్నాడు. అలాగే, తాను మరికొందరికి అప్పులు ఇచ్చానని, అవి తిరిగి రాకపోవడం, వ్యాపారంలో నష్టాలతో అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందని ఐపీ దాఖలు చేశారు.