ఖమ్మం నగరం 32 వ డివిజన్ పరిధిలోని నర్తకి టాకీస్ సమీపంలోని మురళీకృష్ణ మందిరంలో ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7-00 లకు కృష్ణ కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మొదట విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధన మరియు స్వామివారికి కళ్యాణక్రతువును ఆలయ అర్చకులు మరియు కొణకంచి సాయిరాం శర్మ, యోగినాధ్ శర్మ జరిపించారు.