చర్ల: పోలీసులకు సమాచారం ఇస్తున్నాడని యువకుని హత్య
చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్ ఖేల్ గ్రామానికి చెందిన దినేష్ పూజారి అనే యువకుడిని బుధవారం ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు మంగళవారం హత్య చేశారు. భద్రతా బలగాలకు సమాచారం అందిస్తూ, మావోయిస్టు పార్టీకి నష్టం జరిగేలా వ్యవహారిస్తుండటంతో హత్యకు పాల్పడినట్లు ఘటనా స్థలం వద్ద పామేడు ఏరియా కమిటీ పేరు మీద మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు.