గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు మరో క్రిమినల్ ముఠా బంబిహా ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బంబిహా ముఠా నాయకుడు కుశాల్ చౌధ్రీ తన గ్యాంగ్ పలుకుబడిని పెంచుకోవడానికి లారెన్స్ గ్యాంగ్‌ను అంతం చేయాలని చూస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వ్యాపారి ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఘటనలో బంబిహా ముఠా సభ్యుడు అరెస్ట్ అయ్యాడు. అతన్ని విచారించగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.