మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు అస్వస్థత

6256பார்த்தது
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు అస్వస్థత
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇంట్లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించి వైద్యం అందిస్తున్నారు. గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు.

தொடர்புடைய செய்தி