చర్ల: తాలిపేరు ప్రాజెక్టును కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సోమవారం సందర్శించారు. తాలిపేరు జలాశయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దే అంశంపై జలవనరులశాఖ అధికారులతో చర్చించారు. జలాశయంలో పూడిక తీస్తేనే బోటింగ్ కు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన మట్టి కోసం జలాశయంలో పూడికతీతకు ప్రతిపాదించామని వివరించారు. పర్యాటకులు మెచ్చేలా పల్లె ప్రకృతి వనాన్ని శుభ్రం చేయించాలని ఆదేశించారు.