యువత రాజకీయ చైతన్యం కలిగి ఉండి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోదెం వీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం దుమ్ముగూడెం మండలంలోని గంగోలు గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరమాచినేని వినీల్ ఆధ్వర్యంలో జరిగిన యువజన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత రాజకీయాల్లో చైతన్యవంతంగా ముందుకు వచ్చి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.