ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఖాళీ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి కొత్త నివాసానికి వెళ్లారు. ఇటీవల ఢిల్లీ సీఎంగా ఆతిశీకి బాధ్యతలు అప్పగించడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాగా, లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ మీద వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు.