TG: పాలమూరు అభివృద్ధిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను సీఎం అయ్యాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడితే.. దాన్ని అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తిచేస్తామంటే కాళ్లల్లో కట్టె బెడుతున్నారనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల రీడిజైన్ల పేరిట గత పదేళ్లు కేసీఆర్ దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు.