ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సజావుగానే ధాన్యం సేకరణ కొనసాగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఎంత మంది రైతులు ధాన్యం కేంద్రంలో పోశారు? ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్లు ధాన్యం సేకరించారని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆరా తీశారు.