సిరిసిల్ల పట్టణంలోని ప్రవేట్ ఆసుపత్రిలో అత్యవసర సమయంలో ఆర్ఎస్ఐ శ్రీనివాస్ (ఎ+)రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యుల సైతం చెబుతున్నారు. రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన ఆర్ఎస్ఐ శ్రీనివాస్ ను పలువురు అభినందిస్తున్నారు. గురువారం రాత్రి 12 గంటలకు అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలని సమాచారం అందడంతో స్పందించినట్లు తెలిపారు.