రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట నుండి కోరుట్లపేట దాకా 15 కోట్ల రూపాయల సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులతో రోడ్డు విస్తరణ పనులను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాకు చేరుకోవడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.