సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం- 3 ఏరియా సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకరరావు, విజయలక్ష్మి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రామగిరి మండలం సెంటినరీకాలనీ సేవా భవన్ లో టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యూట్ బ్యాగ్ తయారీ, బ్యూటిషియన్ లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను ప్రారంభించారు.