రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సీపీ అధ్యక్షతన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, రవాణా శాఖ, నేషనల్ హైవే రహదారికి సంబంధించిన అధికారులు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో సమీక్ష జరిపారు.