పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలోని శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జూలపల్లి మండలం పెద్దాపూర్ లో శ్రీ యోగానంద లక్ష్మినరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయరమణరావుకి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.