పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆద్వర్యంలో మంగళవారం వైద్య శిభిరం నిర్వహించారు. శిబిరాన్ని కమీషనర్ వెంకటేష్ ప్రారంభించారు. కార్మికుల ఆరోగ్యంపై వివిధ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్మికుల ఆరోగ్యం కాపాడడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కమీషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ పాల్గొన్నారు.