కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. జూలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన 60 మంది కళ్యాణ లక్ష్మి, షాది ముభారఖ్ లబ్ధిదారులకు రూ. 60, 06, 960 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపిడిఓ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.