జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ రెసిడెన్షియల్ గురుకులాలను తనిఖీ చేసి మరమ్మత్తు పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో జిల్లాలో గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హాస్టల్స్ లో మరమ్మతు పనులు, పిల్లలకు మౌలిక వసతుల ప్రతిపాదనలు తయారు చేసి ఈనెల 20 నాటికి సమర్పించాలని ఆదేశించారు.