జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం ఓదెలలో పోచమ్మ ఆలయం చుట్టూ దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆలయాన్ని అన్ని రంగాల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.