విద్యుత్ సమస్యలు తమ దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఎన్ పిడిసిఎల్ ఎస్ఈ బొంకూరి సుదర్శన్ అన్నారు. గురువారం రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి రాగా తెలుసుకున్నారు. అలాగే పాత ఎల్టి లైన్ తరచుగా తెగిపోనుందని పలువురు ఎస్ఈ దృష్టికి తీసుకువచ్చారు. దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న పాత ఎల్ టి లైన్ స్థానంలో కొత్త వైర్ వేయడం జరుగుతుందని తెలియజేశారు.