కేశవపట్నం జాతీయ రహదారిపై కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ స్నేహితుడి కుటుంబానికి చిరు సాయాన్ని చేసి అండగా నిలిచారు ఆ స్నేహితులు. శంకరపట్నం మండలంలోని మక్త గ్రామానికి చెందిన షేక్ అజీమ్ అతని కుమారుడు షేక్ రెహమాన్ రంజాన్ మాసంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడగా 2004-2005 వరకు అతనితో కలసి చదువుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు చలించి ఆదివారం రూ. 28, 800 నగదు, 75 కేజీల బియ్యం వితరణ చేశారు.