క్షేత్రస్థాయి విద్యలో నైపుణ్యత పెంపొందించే కార్యక్రమం

467பார்த்தது
క్షేత్రస్థాయి విద్యలో నైపుణ్యత పెంపొందించే కార్యక్రమం
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లోని ఆఫీసు అసిస్టెంట్ షిప్ (ఓ. ఎ) ఒకేషనల్ కోర్సు ఓజేటిలో భాగంగా తరగతి గదిలో నేర్చుకున్న విద్యనే కాకుండా క్షేత్రస్థాయి విద్యలో నైపుణ్యత పెంపొందించే కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ జగిత్యాల-సి బ్రాంచ్ మేనేజర్ మూదాం గణేష్ కుమార్, యూనిట్ మేనేజర్ టేకుల గోపి సహకారంతో విద్యార్థులకు సేవింగ్స్, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత, ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పొదుపులు భీమా ప్రాముఖ్యతను అదేవిధంగా భీమాను తీసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు కోక్కుల గంగాధర్, ప్రతిభ , రాజు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி