తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎండి అజ్గర్ పాషా ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కి 17 అంశాలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల మరియు నర్సింగ్, పారామెడికల్, మరియు శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్ తదితర విభాగాలలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో మాట్లాడి మీ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కారం జరిగేలా చేస్తానని చెప్పడం జరిగింది.