నేర నిరూపణ సమర్థవంతంగా చేయడం ద్వారానే నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.