జగిత్యాల పట్టణానికి చెందిన ముగ్గురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన మూడు లక్షల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు అడువాల లక్ష్మణ్, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, పద్మ శేఖర్, రజి, నాయకులు మనాల కిషన్ పాల్గొన్నారు.