పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్ లో సోమవారం ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలసి పాల్గొన్నారు. ముందుగా పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 1985 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పోలీస్ విధి నిర్వహణలో భాగంగా 14 మంది పోలీసులు ఒక హోంగార్డులు వీర మరణం చెందినారన్నారు.