జగిత్యాల జిల్లాలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు సత్వరం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ ప్రజావాణిలో ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆమె సమర్పించిన వినతిపత్రంలో జిల్లాలో ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు కార్యాలయాల్లో తమపై జరుగుతున్న వేధింపులను తమ సంఘం దృష్టికి తెచ్చారన్నారు.