భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో సోమవారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.