సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం కల్పించిన మహోన్నత వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీమ్ రావు పాల్గొన్నారు.