పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్

65பார்த்தது
పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రఘునాథ్
పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎరువ రఘునాథ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన పీఆర్టీయూ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రఘునాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ విధులు నిర్వహిస్తున్నారు. పీఆర్టీయూ ఎన్నికల్లో మోడల్ స్కూల్స్ తరుఫున ప్రథమసారి ప్రాతినిథ్యం దక్కడం ఆనందంగా ఉందని రఘునాథ్ అన్నారు. ఈయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి.

தொடர்புடைய செய்தி