ఎల్లారెడ్డి: నీరు నిల్వకుండా నూతన మురికి కాలువ నిర్మాణం చేస్తాం

70பார்த்தது
ఎల్లారెడ్డి: నీరు నిల్వకుండా నూతన మురికి కాలువ నిర్మాణం చేస్తాం
ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డు కింద గల బీసీ కాలనీలో మురికి నీరు నిల్వ ఉండకుండా నూతన మురికి కాలువను నిర్మిస్తామని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో నెలకొన్న మురికి కాలువ సమస్యను మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సమస్యకు వారం రోజుల్లో చెక్ పెడ్తామన్నారు.

தொடர்புடைய செய்தி